పిల్లల రహస్యం: టీఆర్ఎస్ కార్పోరేటర్‌పై అనర్హత వేటు

By narsimha lodeFirst Published Jul 3, 2019, 5:14 PM IST
Highlights

 ముగ్గురు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించిన టీఆర్ఎస్‌ కార్పోరేటర్‌పై   నాంపల్లి కోర్టు అనర్హత వేటేసింది. బీజేపీకి చెందిన  మాజీ కార్పోరేటర్ ఉమాదేవి భర్త రమేష్ యాదవ్  పిటిషన్‌పై బుధవారం నాడు  కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

హైదరాబాద్: ముగ్గురు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించిన టీఆర్ఎస్‌ కార్పోరేటర్‌పై   నాంపల్లి కోర్టు అనర్హత వేటేసింది. బీజేపీకి చెందిన  మాజీ కార్పోరేటర్ ఉమాదేవి భర్త రమేష్ యాదవ్  పిటిషన్‌పై బుధవారం నాడు  కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

నిబంధనలకు విరుద్దంగా ముగ్గురు పిల్లలున్నా టీఆర్ఎస్ అభ్యర్ధి ఎక్కాల కన్నా చైతన్య ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని దాచేశారు.  నిబంధనలకు విరుద్దంగా ముగ్గురు పిల్లలు ఉన్నారని బీజేపీ నేత రమేష్ యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కన్నా చైతన్యకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని దాచిపెట్టినట్టుగా  విచారణలో తేలింది.దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.కన్నా చైతన్య తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్ధిని కార్పోరేటర్ గా కొనసాగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో  ఉమా రమేష్  వర్గీయులు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!