మోదీ-కేసీఆర్ లు మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు.. నామా

Published : Dec 02, 2018, 11:23 AM IST
మోదీ-కేసీఆర్ లు మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు.. నామా

సారాంశం

మైనార్టీలను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జమిలి ఎన్నికలు రావాలన్న నరేంద్ర మోదీ.. కేసీఆర్‌ కోసమే ముందస్తు ఎన్నికలకు అంగీకరించారని ఆరోపించారు. 

దేశ ప్రధాని నరేంద్రమోదీ తో.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నామా.. ఆదివారం ఖమ్మంలో సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ.. మైనార్టీలను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జమిలి ఎన్నికలు రావాలన్న నరేంద్ర మోదీ.. కేసీఆర్‌ కోసమే ముందస్తు ఎన్నికలకు అంగీకరించారని ఆరోపించారు. 

మోదీ-కేసీఆర్‌లు తెర వెనుక కలిసి పనిచేస్తున్నారని.. వారిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనన్న నామా.. టీఆర్‌ఎస్‌ మరోసారి గెలిస్తే పోరాడి సాధించుకున్న తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
Strong Wind Alert : వాయుగుండం కాదిది వాయు'గండం'.. ప్రచండ గాలులతో ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే