నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం....

By Arun Kumar PFirst Published Oct 15, 2018, 8:59 PM IST
Highlights

శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు ఎంతటి త్యాగాలకైనా సిద్దపడతారని నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ పద్మనాభ రెడ్డి తెలిపారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.

శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు ఎంతటి త్యాగాలకైనా సిద్దపడతారని నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ పద్మనాభ రెడ్డి తెలిపారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అక్టోబర్ 15న ప్రారంభమైన వారోత్సవాలు 21 వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. అందులో మొదటిరోజైన ఇవాళ  ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల ఆయుధాల వినియోగం, నేరాల నియంత్రణ, బాంబు డిస్పోజల్, డాగ్ స్వ్యాడ్  పనివిధానంపై చిన్నారులు, ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఓపెన్ హౌజ్ చేపట్టామన్నారు. ఆయన స్వయంగా చిన్నారులకు ఆయుధాల వినియోగం, నేరాల నియంత్రణ తదితర అంశాల గురించి వివరించారు. 

ప్రజల నుండి తాము సానుభూతి కాకుండా సహకారం కోరుతున్నట్లు పద్మనాభ రెడ్డి తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలందిస్తూనే వారి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణ చేపడతామన్నారు. ఉగ్రవాదాన్ని, సంఘవిద్రోహ శక్తుల ఆటకట్టించడంలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. 

1959 అక్టోబర్ 21 వ తేదీన భారత సరిహద్దులోని లడక్ ప్రాంతంలో చైనా మూకల దాడిలో 438 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారనీ... వారి త్యాగానికి గుర్తుగానే అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను జరుపుతామని వివరించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను గుర్తు చేసుకుంటామన్నారు.  

click me!