సంచులు మోసి పదవులు తెచ్చుకున్నావ్: రేవంత్ రెడ్డిపై చిరుమర్తి లింగయ్య ఆరోపణలు

Siva Kodati |  
Published : Aug 10, 2021, 02:37 PM IST
సంచులు మోసి పదవులు తెచ్చుకున్నావ్: రేవంత్ రెడ్డిపై చిరుమర్తి లింగయ్య ఆరోపణలు

సారాంశం

సీఎం కేసీఆర్ చేసిన ప్రజా సంక్షేమం, కార్యక్రమాలను చూసి రేవంత్‌కు నిద్ర పట్టడం లేదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఆయన బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని లింగయ్య హితవు పలికారు

టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నీతి నిజాయితీ లేని కుక్క రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పదవులు, డబ్బే ముఖ్యమని ఆరోపించారు. ఆయనకు ప్రమాణాలు, ప్రజాసేవ అవసరం లేదన్నారు.

సీఎం కేసీఆర్ చేసిన ప్రజా సంక్షేమం, కార్యక్రమాలను చూసి రేవంత్‌కు నిద్ర పట్టడం లేదని లింగయ్య మండిపడ్డారు. ఆయన బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. సంచులు మోసి పదవులు తెచ్చుకున్నావంటూ రేవంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన గౌరవమెంతో చెప్పాలని లింగయ్య డిమాండ్ చేశారు. రేవంత్ చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో తగిన రీతిలో వాత పెడతారని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే కాంగ్రెస్‌కు కడుపు మంట ఎందుకని లింగయ్య విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి.. సీఎం కేసీఆర్‌పై పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే గురుకులాలకు సేవలందించారని అలాంటి వ్యక్తి పైనే విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ప్రవీణ్ కుమార్ కూడా రాజకీయంగా మరో జయ ప్రకాష్ నారాయణ అవుతారని లింగయ్య ఎద్దేవా చేశారు.
 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu