చంద్రబాబుతో కాంగ్రెస్ నేత భేటీ: మతలబు ఏమిటి?

By telugu teamFirst Published Jul 14, 2019, 10:03 AM IST
Highlights

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నాగం జనార్దన్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్‌ కూడా చంద్రబాబును కలిశారు.

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. శనివారం హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. తెలంగాణలో పరిస్థితిపై, రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య అరగంట పాటు చర్చించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నాగం జనార్దన్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్‌ కూడా చంద్రబాబును కలిశారు.

ఆంధ్రప్రదేశ్  తెలుగుదేశం నేతలు కోడెల శివప్రసాదరావు, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి చంద్రబాబును కలిశారు. మునిసిపల్‌ ఎన్నికల్లో శాతం సీట్లను మైనారిటీలకు కేటాయించాలని  చంద్రబాబును కోరినట్లు పార్టీ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు తాజుద్దీన్‌ తెలిపారు.

click me!