కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యం అని, ఏ పార్టీ మారినా తన ఏకైక లక్ష్యం అదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఢిల్లీ : కెసిఆర్ ను ఓడించడమే తన లక్ష్యం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్లో నుంచి బిజెపిలోకి వెళ్లినా… బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి చేరిన.. అదే తన ఏకైక లక్ష్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.‘బిజెపిలో చేరడానికి కారణం…కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకుంటుందని.. కానీ కెసిఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఆ పార్టీలో నుంచి బయటికి వచ్చాను. ఆ పార్టీలో నాకు ప్రాధాన్యత ఇచ్చారు, గౌరవం దక్కింది. కానీ… నా లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
తెలంగాణలో ఎన్నికల్లో ఎవరికి పూర్తి సీట్లు రాకుండా హాంగ్ గనక వచ్చేటట్లయితే… బిజెపి, ఎంఐఎం ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తారు. అందుకే బిజెపికి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లే. నన్ను ప్రజలు కాంగ్రెస్లో ఉండాలని కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘కెసిఆర్ ధన అధికార మధంతో మాట్లాడుతున్నాడు. సర్వేల్లో నాకే అనుకూలంగా ఉన్నాయి. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని చూస్తున్నాడు. ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తున్నానని ఆఫర్ ఇచ్చాడు.. అంటూ కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు.
కాగా, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాక్రే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ సభ్యత్వం అందించారు.