ఓట‌ర్ల‌కు తాయిలాలు: పొంగులేటి ఫొటోతో గోడ గడియారాలు.. ఈసీ చ‌ర్య‌లు

By Mahesh Rajamoni  |  First Published Oct 27, 2023, 10:37 AM IST

Khammam: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లువురు అభ్య‌ర్థులు ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి తాయిలాలు అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ ఖ‌మ్మం నాయ‌కుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫొటోతో ఉన్న గోడ గ‌డియారాల‌ను ఎన్నిక‌ల సంఘం (ఈసీ) స్వాధీనం చేసుకుంది. గోడ గడియారాలపై మాజీ బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫొటోతో పాటు 'నా కుమార్తె పెళ్లి సందర్భంగా, ప్రేమతో, మీ శ్రీన్న' అని రాసి ఉంది.
 


Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లువురు అభ్య‌ర్థులు ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి తాయిలాలు అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ ఖ‌మ్మం నాయ‌కుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫొటోతో ఉన్న గోడ గ‌డియారాల‌ను ఎన్నిక‌ల సంఘం (ఈసీ) స్వాధీనం చేసుకుంది. గోడ గడియారాలపై మాజీ బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫొటోతో పాటు 'నా కుమార్తె పెళ్లి సందర్భంగా, ప్రేమతో, మీ శ్రీన్న' అని రాసి ఉంది.

వివ‌రాల్లోకెళ్తే.. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీప బంధువు తుంబూరు దయాకర్ రెడ్డి ఇంట్లో రూ.46.89 లక్షల విలువైన 9,750 గోడ గడియారాలను ఎన్నికల సంఘం (ఈసీ) ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. గోడ గడియారాలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫొటో ఉంది. అలాగే, పొంగులేటి ఫొటో కింద “నా కుమార్తె వివాహం సందర్భంగా, ప్రేమతో, మీ శ్రీనన్నా” అని తెలుగులో రాసి ఉంది. కాగా, 2022 ఆగస్టులో రూ. 250 కోట్ల విలువైన ఇవే గడియారాలను ఆయన కుమార్తె పెళ్లి సందర్భంగా ఖమ్మం గ్రామాలకు మెమెంటోలుగా పంపిణీ చేశారు.

Latest Videos

మిగిలిపోయిన గోడ గడియారాలను ఆయన బంధువు తుంబూరు దయాకర్ రెడ్డి నివాసంలో భద్రపరిచారనీ, వాటిని ఇటీవల కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపిణీ చేసినట్లు సమాచారం అంద‌టంతో ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకుంది. వాటిని సీజ్ చేసి, స్వాధీనం చేసుకుంది. ఇదిలావుండ‌గా, 2023 ఏప్రిల్‌లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పొంగులేటిని బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జూలైలో ఖమ్మంలో జరిగిన 'తెలంగాణ జనగర్జన' బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు ఖ‌మ్మం కీల‌క నేత‌లు కాంగ్రెస్ లో చేరారు.

click me!