‘టీఆర్ఎస్ లో వివక్ష.. కేటీఆర్ వర్గానికి పదవులు, హరీష్ రావు వర్గానికి అణిచివేతలు’.. మురళీయాదవ్..

By Bukka SumabalaFirst Published Aug 8, 2022, 9:08 AM IST
Highlights

పార్టీనుంచి సస్పెండ్ అయిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ టీఆర్ఎస్ మీద మళ్లీ విమర్శలు చేశారు. కేటీఆర్ వర్గానికి పదవులు ఇస్తూ, హరీష్ వర్గాన్ని అణగదొక్కుతున్నారన్నారు.

మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు అగ్రవర్ణాలకు ఇస్తున్నారని, టిఆర్ఎస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టిఆర్ఎస్ లో బీసీలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కాగా, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయనను టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్, హరీష్ వెంటే ఉండి, రాష్ట్ర సాధనకు పోరాడామని అన్నారు.  అంతర్గతంగా పార్టీ గురించి చర్చించాలంటే అధిష్టానాన్ని కలిసే అవకాశం రావాలని అన్నారు. కానీ, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకే ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేకపోతే తనవంటి వారు పార్టీలో జరుగుతున్న విషయాలు చెప్పే అవకాశం ఎక్కడ దొరుకుతుంది అని వాపోయారు. పార్టీలో కేటీఆర్ వర్గానికి పదవులు ఇస్తూ.. హరీష్ రావు వర్గాన్ని అణగదొక్కారని ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్తును నర్సాపూర్ ప్రజలే నిర్ణయిస్తారని... వారి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. 

రేపు స్పీకర్‌ను కలుస్తా.. ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే ఒకే, లేదంటే రెండ్రోజులైనా వెయిట్ చేస్తా : రాజగోపాల్ రెడ్డి

ఇదిలా ఉండగా, శనివారం నాడు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.  నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఇప్పటికే ఆయన భార్యకు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ పదవిని, ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని పార్టీ కట్టబెట్టిందని గుర్తుచేశారు. 
 

click me!