మునుగోడు బైపోల్ 2022: తొలి రోజు రెండు నామినేషన్లు దాఖలు

By narsimha lode  |  First Published Oct 7, 2022, 4:34 PM IST

మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇవాళ్టి నుండి నామినేషన్లను  స్వీకరిస్తున్నారు.  మునుగోడు అసెంబ్లీ స్థానానికి శుక్రవారంనాడు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు, ఎల్లుండి నామినేషన్లు స్వీకరించరు. 



నల్గొండ: మునుగోడు అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నాడు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.  మునుగోడు ఉప ఎన్నికలకుసంబంధించి నోటిఫికేషన్ ఇవాళే విడుదలైంది. ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీవరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.  

ప్రజాఏక్తా పార్టీ నుండి నాగరాజు,ఇండిపెండెంట్ గా మారం వెంకట్ రెడ్డిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రెండో శనివారం కావడంతో రేపు, ఆదివారం కావడంతో ఎల్లుండి నామినేషన్లు స్వీకరించరు. సోమవారం నుండి నామినేషన్ల స్వీకరించనున్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈనెల 10వ తేదీన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు

Latest Videos

బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ ఎప్పుడు దాఖలు చేస్తారో ఇంకా స్పష్టత రాలేదు.ఈ నెల 12, 14 తేదీన మంచి ముహుర్తాలున్నందున ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.నామినేషన్ల దాఖలుకు ఈనెల 14వ తేదీ  చివరి తేదీ.  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రజా శాంతి పార్టీ నుండి ప్రజాయుద్ధనౌక గద్దర్ పోటీ కి దిగనున్నారు. ఎన్నికల బరిలో గద్దర్ పోటీకి దిగడం ఇదే  మొదటిసారి, మునుగోడు ఉప ఎన్నికల్లో తాము  కూడా బరిలో నిలుస్తామని తెలంగాణ జన సమితి చీఫ్  కోదండరామ్ ప్రకటించారు.

click me!