మునుగోడు బైపోల్ 2022: పదకొండో రౌండ్‌లో కారు జోరు

Published : Nov 06, 2022, 03:10 PM ISTUpdated : Nov 06, 2022, 03:15 PM IST
మునుగోడు బైపోల్ 2022: పదకొండో  రౌండ్‌లో కారు జోరు

సారాంశం

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్  లో  11వ రౌండ్ లో టీఆర్ఎస్ లీడ్ లో నిలిచింది. నాలుగో రౌండ్ నుండి 11 రౌండ్ వరకు  టీఆర్ఎస్  ఆధిక్యంలో  నిలిచింది.  

మునుగోడు:మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక కౌంటింగ్ లో పదకొండో రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఆదిక్యంలో నిలిచారు. 11వ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి 7,235 ఓట్లు,బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి 5,877 ఓట్లు వచ్చాయి.

మునుగోడు అసెంబ్లీ  ఉప  ఎన్నిక కౌంటింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు.చౌటుప్పల్  పట్టణంతో పాటు రూరల్ మండలంపై  బీజేపీ ఆశలు  పెట్టుకుంది. అయితే  ఫస్ట్  రౌండ్ లో బీజేపీ  కంటే  టీఆర్ఎస్  ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండ్ రౌండ్ లో బీజేపీ టీఆర్ఎస్ పై పైచేయి సాధించింది.మూడో రౌండ్ లో కూడ బీజేపీ లీడ్ దక్కించుకుంది. నాలుగో రౌండ్ నుండి పదకొండో రౌండ్  వరకు టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. బీజేపీ  కేవలం  2,3 రౌండ్లలో మాత్రమే లీడ్ లో నిలిచింది.  11 రౌండ్లు  పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి 74,574 ఓట్లు,బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి 68,800 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి  స్రవంతికి  16,280  ఓట్లు  వచ్చాయి.

also read:మునుగోడు బైపోల్ 2022: పదో రౌండ్‌లోనూ కోమటిరెడ్డిపై కూసుకుంట్ల ఆధిక్యం

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

PREV
click me!

Recommended Stories

Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu