మునుగోడు బైపోల్ 2022: మర్రిగూడలో బీజేపీ ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జీ

By narsimha lode  |  First Published Nov 3, 2022, 10:27 AM IST

స్థానికేతరులున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ క్యాడర్   మర్రిగూడలో  రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు  దిగారు. ఆందోళన కారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు


నల్గొండ:స్థానికేతరులున్నా అధికారులు  పట్టించుకోవడం లేదని మర్రిగూడ మండల  కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు గురువారంనాడు రోడ్డుపై బైఁఠాయించి  ఆందోళన నిర్వహించారు.  దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వారిపై స్వల్ప  లాఠీచార్జీ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 

మర్రిగూడ మండల కేంద్రంలో స్థానికేతరులున్నారని చెప్పినా కూడ అధికారులు  పట్టించుకోవడం లేదని బీజేపీ  నేతలు ఆరోపించారు.తమ డిమాండ్  పై  అధికారులు చర్యలు తీసుకోవాలని   బీజేపీ డిమాండ్  చేసింది. ఈ డిమాండ్ తో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.

Latest Videos

చండూరులోని నాలుగో వార్డులో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ ,బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికేతరులను బీజేపీ శ్రేణులు  పట్టుకొనే  ప్రయత్నం చేశారు.దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

సంస్థాన్  నారాయణపురం మండలం పుట్టపాకలోని ఓ ఫంక్షన్ హల్ లో స్థానికేతరులున్నారనే సమాచారం మేరకు ఎన్నికల అబ్జర్వర్  దాడి చేశారు. ఈ ఫంక్షన్ హల్ లో ఉన్న వారిని  పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారి  వద్ద రూ.3 లక్షల నగదుతో  పాటు లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు.

also read:మునుగోడు బైపోల్ 2022:పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నందన్న వికాస్ రాజు

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. ఈ  నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 

click me!