మునుగోడు ఉప ఎన్నికల్లో రెండు రౌండ్లలో మినహా ఇతర రౌండ్లో బీజేపీ లీడ్ ను సాధించలేకపోయింది. బీజేపీ ఎక్కువగా చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీపై కేంద్రీకరించింది. చండూరులో బీజేపీకి ఆశించిన ఫలితం బీజేపీకి దక్కలేదు.
మునుగోడు:మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు రౌండ్లలో మినహా ఏ రౌండ్ లో కూడ బీజేపీ మెజారిటీని దక్కించుకోలేకపోయింది. చౌటుప్పల్ పట్టణంలోని బీజేపీ ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో మినహా మిగిలిన చోట్ల బీజేపీకి ఆధిక్యత లభించింది. మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతను సాధించింది. రెండు, మూడు రౌండ్లలో బీజేపీ లీడ్ లో ఉంది., నాలుగో రౌండ్ నుండి 15 వ రౌండ్ వరకు టీఆర్ఎస్ లీడ్ లో కొనసాగింది.
మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ కు 1292 ఓట్ల మెజారిటీ దక్కింది. రెండో రౌండ్ లో బీజేపీకి 841 ఓట్ల మెజారిటీ, మూడో రౌండ్ లో బీజేపీకి 36 ఓట్ల లీడ్ దక్కింది. నాలుగో రౌండ్ నుండి టీఆర్ఎస్ ను బీజేపీ నిలువరించలేకపోయింది. నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ కు 299 ఓట్ల మెజారీటీ,ఐదో రౌండ్ లో 917 ఓట్ల లీడ్ దక్కింది. ఆరో రౌండ్ లో 638 , ఏడో రౌండ్ లో 386 ఓట్ల మెజారిటీ లభించింది. ఎనిమిదో రౌండ్ లో 532 ఓట్లు , 9వ రౌండ్ లో 832 ఓట్ల మెజారిటీ దక్కింది.10 వ రౌండ్ లో 484 ఓట్లు ,11వ రౌండ్ లో 1358 ఓట్లు, 12వ రౌండ్ లో 2042 ఓట్ల భారీ ఆధిక్యం టీఆర్ఎస్ కు దక్కింది. , 13వ రౌండ్ లో 1285 ఓట్ల మెజారిటీ 14వ రౌండ్ లో 1,055 ఓట్ల మెజారిటీని సాధించింది.
also read:మునుగోడు బైపోల్ 2022: 14వ రౌండ్ లో టీఆర్ఎస్ హవా
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 47 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.