తెలం్గాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పదవి సీఎం కేసీఆర్ కు విధేయుడు, విశ్వాసపాత్రుడు అయిన సోమేష్ కుమార్ కే దక్కే అవకాశాలున్నాయి. సీనియారిటీలో ముందు ఉన్నప్పటికీ అజయ్ మిశ్రాను పక్కన పెట్టే అవకాశం ఉంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రధాన కార్యదర్శి పదవి సోమేష్ కుమార్ ను వరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సీనియారిటీలో అజయ్ మిశ్రా ముందు ఉన్నప్పటికీ సోమేష్ కుమార్ కే ఆ పదవి లభించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమేష్ కుమార్ ముఖ్యమంత్రి కెసీఆర్ కు అత్యంత విధేయుడు.
అజయ్ మిశ్రా 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి కాగా, సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అజయ్ మిశ్రాకు అత్యంత ముఖ్యమైనే అధికారుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. సోమేష్ కుమార్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు
undefined
ఇద్దరి సర్వీసులను సీఎస్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అజయ్ మిశ్రా 2020 జులైలో పదవీ విరమణ చేయనున్నారు. సోమేష్ కుమార్ పదవీకాలం 2023 డిసెంబర్ వరకు ఉంది. సీనియారిటీ పరంగా అజయ్ మిశ్రా తర్వాత శైలేంద్ర కుమార్ జోషీ ఉన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. అయితే, పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించి ఆయన తెలంగాణకు వచ్చారు. ఏ పదవి అప్పగించినా సమర్థంగా, నమ్మకంగా పనిచేయగలరనే నమ్మకం సోమేష్ కుమార్ పై కేసీఆర్ కు ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు జోషీ పదవీ విరమణ చేయనున్నారు.