కాంగ్రెస్‌లోనే బీసీలకు ప్రాధాన్యం..దానం ఎందుకు అలా అన్నారో

First Published Jul 1, 2018, 3:25 PM IST
Highlights

కాంగ్రెస్‌లోనే బీసీలకు ప్రాధాన్యం..దానం ఎందుకు అలా అన్నారో

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అవమానం జరుగుతోందని.. బీసీ నేతలను కావాలనే అణగదొక్కుతున్నారంటూ.. కొద్దిరోజులు క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని వీడే సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురికి ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు చెందిన మరో సీనియర్ ముఖేశ్ గౌడ్ స్పందించారు.

కాంగ్రెస్‌లో బీసీలను అణగదొక్కడం లేదని.. బీసీలు యాచించేవారుగా ఉండకూడదని.. లాక్కొనేవారిగా ఉండాలని ముఖేశ్ గౌడ్ అన్నారు. ఎవరికిందా పనిచేయాల్సిన అవసరం లేదని.. బీసీలు, మైనార్టీలు, దళితులు కలిస్తే తిరుగుండదని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని.. అందుకే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని.. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందన్నారు.. పార్టీ అన్నాకా.. నేతల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సహజమేనన్నారు.. పార్టీ మారే అంశంపై స్పందిస్తూ.. ఈ విషయంపై అనుచరులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 


 

click me!