పోరాటాలు చేసేవారంతా కేసీఆర్‌కు శత్రువులే: మంద కృష్ణ మాదిగ

By Arun Kumar PFirst Published Apr 17, 2019, 3:19 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పిఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. దళిత వర్గాలు దేవుడిలా భావించి పూజించే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ని ఆయన ఏనాడూ గౌరవించలేదన్నారు.గడిచిన ఐదేళ్లలో కనీసం అధికారికంగానైనా అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనలేదని...దీన్ని బట్టే రాజ్యాంగ నిర్మాతపై ఆయనకు ఎంత గౌరవముందో అర్థమవుతుందని కృష్ణ మాదిగ అన్నారు. 
 
ఎస్సీ, ఎస్టీ, బిసిలు తదలెత్తుకుని ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారంటే అందుకు అంబేద్కర్ చలవే కారణం. అలాంటిది ఆయన జయంతి ఉత్సవాలకు కేసీఆర్ రాకపోవడాన్ని మేము ప్రశ్నించామమని...అందులో తప్పేముందని అన్నారు. ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తాం అంటే అది పద్ధతి కాదన్నారు.  ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేసే వాళ్ళను ముఖ్యమంత్రి శత్రువుల్లాగా చూస్తున్నారని...అలా చూడటం మానేకోవాలని సూచించారు. తాము చేసే పోరాటాలు అన్ని ప్రజల కోసమేనని మంద కృష్ణ వెల్లడించారు. 
 
తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటివరకు 5 సంవత్సరాలు గడుస్తున్నాయని...కానీ ఒక్క సంవత్సరం కూడా ఆయన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొనలేదని ఆరోపించారు.పార్టీ అధ్యక్షుడిగా కూడా గతంలోనూ ఆయన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. తన ఫామ్ హౌస్ దగ్గరున్న ఎర్రవెల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ ఒక్కసారి కూడా పూల  దండ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికారంలోకి వచ్చిన కొత్తలో కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తామన్న 125 అడుగుల విగ్రహం కనపడడం లేదని మంద కృష్ణ ఎద్దేవా చేశారు. కానీ తాము సొంత డబ్బులతో పంజాగుట్టలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ద్వంసం చేసి డంపింగ్ యార్డ్ లో పడివేయించారని అన్నారు.  అలా విగ్రహాన్ని విరగగొట్టడాన్ని నిరసిస్తూ ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇవ్వకుండా ఉద్దేశ్య పూర్వకంగానే దళితులను అవమానిస్తున్నారని మండిపడ్డారు.  

ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలుపుతామన్నా వినకుండా  తనను హౌజ్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర పోషించిందని..ఉద్యమం నుండి ప్రభుత్వం ఏర్పడే వరకు కేసీఆర్ కు అండగా వున్నామన్నారు. కానీ ఆయన మాత్రం  తమపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మందకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
click me!