బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మార్పీఎస్ బంద్ వాయిదా

Published : Mar 11, 2018, 07:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మార్పీఎస్ బంద్ వాయిదా

సారాంశం

విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా 13వ తేదీ బంద్ వాయిదా ప్రకటించిన ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్ ఈనెల 13వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. బంద్ జరిపే బదులు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది.

ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ విలేకరులతో మాట్లాడారు. ఇంటర్  విద్యార్థుల కు ఇబ్బంది కలిగించడం భావ్యం కాదన్న ఉద్దేశంతోనే తాము బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తమ బంద్ కు మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలకు మంద ధన్యవాదాలు తెలిపారు. పనిలో పనిగా తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరిపై మంద కృష్ణ ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రికి ఎన్నిసార్లు లేఖలు రాశారో బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు.

సోమవారం నుండి వర్గీకరణ కోసం ఎంపీ లు మాట్లాక పోతే మాదిగలకు శత్రువులు గా గుర్తించి మీకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. టిఆర్ఎస్ కంటే ఎమ్మార్పీఎస్ కు విద్యార్థులు భవిష్యత్ గురించి ఆలోచన ఎక్కువగానే ఉందని మంద స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Holidays : తెలంగాణ ఉద్యోగులకు బంపరాఫర్... ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు సెలవే..!
CM Revanth Reddy Super Speech: ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ | TS Congress | Asianet News Telugu