కేటీఆర్ ని చూసి.. ఆనందంతో చిందులేసిన మల్లారెడ్డి

Published : Nov 22, 2018, 03:15 PM IST
కేటీఆర్ ని చూసి.. ఆనందంతో చిందులేసిన మల్లారెడ్డి

సారాంశం

మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి.. మరోసారి వార్తల్లో నిలిచారు. విద్యార్థులందరి ముందు.. స్టేజిపైన డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. 

మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి.. మరోసారి వార్తల్లో నిలిచారు. విద్యార్థులందరి ముందు.. స్టేజిపైన డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. అది కూడా మంత్రి కేటీఆర్ ని చూసిన ఆనందంలో స్టేజి పైన చిందులు వేశారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న మల్లారెడ్డి వచ్చే నెలలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీపడుతున్నారు. కాగా.. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలపల్లిలోని మల్లారెడ్డి కాలేజ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విద్యార్థులతో ముఖాముఖి చర్చించేందుకు ఆయన అక్కడికి వచ్చారు. కేటీఆర్ వేదికపైకి రాగానే.. మల్లారెడ్డి ఆనందంతో గంతులేశారు. దీంతో అక్కడున్న విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ఆయన డ్యాన్స్ చూసి కేటీఆర్ కూడా నవ్వేశారు. కేటీఆర్ ప్రసంగం అనంతరం మల్లారెడ్డి తనదైన స్టైల్ లో ప్రసంగించారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?