ఓడిపోతే.. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా.. కేసీఆర్ (వీడియో)

By ramya neerukondaFirst Published Nov 22, 2018, 2:54 PM IST
Highlights

ఈ ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే.. గట్టిగ పనిచేస్తానని, ఓడిపోతే.. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటానని ఆయన అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకు పోయేదేమీ లేదని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం ఖానాపూర్  ప్రచార సభలో పాల్గొన్న ఆయన టీడీపీ, కాంగ్రెస్ లపై విమర్శల వర్షం కురిపించారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే.. గట్టిగ పనిచేస్తానని, ఓడిపోతే.. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటానని ఆయన అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్లకు అసలు తెలివిలేదని.. పాలనచేయడం రాదని విమర్శించారు.కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. కరెంట్ కష్టాలు మొదలౌతాయన్నారు. 

‘‘రాష్ట్రం తెచ్చింది నేను. కష్టపడి తెచ్చినా.. 58 ఏళ్లలో వాళ్లు ఏం చేశారు? వీళ్లేమైనా కొత్తగా వచ్చారా? ఓడిపోంగానే.. హిమాలయాలకు పోయి ఆకు పసరు తాగొచ్చరా... పవిత్రం అయిపోయారా.. మళ్లీ నమ్మితే పంటికి అంటకుండా మింగేస్తారు. వాళ్లకు చేతగాక ఆంధ్రకుపోయి చంద్రబాబు నాయుడుని భుజాలపై తీసుకువస్తున్నారు. మళ్లీ చంద్రబాబు అవసరమా.. కత్తి ఆంధ్రోడు ఇస్తాడు. కానీ పొడిచేది తెలంగాణోడే.. బాబు డబ్బులు ఇవ్వాలి.. టిక్కట్లు ఇవ్వాలి. రేపు పెత్తనం చంద్రబాబుది వస్తే దరఖాస్తులు పట్టుకుని అమరావతికి పోవాలి. కొంతమంది అమరావతికి బానిసలు.. మిగిలినవాళ్లు ఢిల్లీ గులాములు. ఈ గులాముల పాలన మనకు కావాలా.? సీరియస్‌గా ఆలోచించండి. లేకుంటే దెబ్బతింటారు.’’ అని కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

"

click me!
Last Updated Nov 22, 2018, 4:52 PM IST
click me!