షర్మిల పార్టీకి కోమటిరెడ్డి ఆల్ ది బెస్ట్.. మహానేతని మరువలేం అంటూ..

Published : Jul 08, 2021, 12:40 PM IST
షర్మిల పార్టీకి కోమటిరెడ్డి ఆల్ ది బెస్ట్.. మహానేతని మరువలేం అంటూ..

సారాంశం

తెలంగాణలో నేడు ఆవిర్భావం కానున్న వైఎస్ షర్మిల పార్టీకి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పార్టీ సభ జరుగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగి వైఎస్సార్ అభిమానులతో ఎంపీ ముచ్చటించారు. 

పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు ఆహ్వానం పంపారని ఆయన తెలిపారు. వెఎస్ గొప్ప నేత అని కొనియాడారు. వైఎస్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నట్టు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 

కాగా, అంతకుముందు కోమటిరెడ్డి ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘మహానేత మీరు.. మీతో నడిచిన ప్రతి అడుగులో ఒక్కో విషయం తెలుసుకున్నాను. రైతులకు అండగా ఉండడం, పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్యం మీ ఆలోచన నుంచి పుట్టినవే. అలాంటి మీరు మాకు దూరం కావడం మా దురదృష్టం. కానీ తప్పకుండా మీరు చూపిన ప్రజా సంక్షేమం కోసమే ప్రతి క్షణం కృష్టి చేస్తాను..’ అని కోమటి రెడ్డి ఫేస్ బుక్ లో రాసుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu