అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న ఎంపీ కవిత

By ramya NFirst Published 23, Feb 2019, 11:52 AM IST
Highlights

నిజామాబాద్ ఎంపీ కవిత.. కేరళ పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం ఆమె కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. 


నిజామాబాద్ ఎంపీ కవిత.. కేరళ పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం ఆమె కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ దర్శనం అనంతరం  కవిత  ట్రావెన్ కోర్ మహారాణి  గౌరి లక్ష్మీ  భాయి మరియు ప్రిన్స్ ఆదిత్య వర్మ లను మర్యాదపూర్వకంగా కలిశారు.  శనివారం తిరువనంతపురం లోని కౌడియర్ ప్యాలెస్ కు వెళ్ళిన ఎంపి కవిత ను మహారాణి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా శయనిస్తున్న పద్భనాభ స్వామి వారి ప్రతిమతో పాటు ఆమె రాసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర, వైశిష్ట్యం గురించి రాసిన పుస్తకాన్ని మహారాణి లక్ష్మీబాయి ఎంపి కవితకు బహూకరించారు. పోచంపల్లి శాలువాను ఎంపి కవిత మహారాణి లక్ష్మీబాయి కి అందజేశారు. అనంతరం పలు అంశాలపై వారిరువురూ చర్చించుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను మహారాణి  గౌరీ లక్ష్మీ భాయి కవితని అడిగి తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్, SUT మెడికల్ సైన్స్ సి ఇ ఓ గౌరీ కామాక్షి, ప్యాలెస్ ఆడిటర్ గోపాల కృష్ణన్, కాంచీపురం శంకర్ పాల్గొన్నారు.

ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో డైమండ్ ఉత్సవాల్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇందులో భాగంగా ఈ రోజు  దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ కవిత ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కేరళ వెళ్లారు.  కేరళ అసెంబ్లీలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు Cast and it's Discontents  అనే అంశంపై ఎంపి కవిత  ప్రసంగించనున్నారు. 

Last Updated 23, Feb 2019, 11:53 AM IST