కేసిఆర్ బర్త్ డే వీడియో సాంగ్ ఆల్బమ్ ఆవిష్కరించిన కవిత

Published : Feb 16, 2018, 12:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కేసిఆర్ బర్త్ డే వీడియో సాంగ్ ఆల్బమ్ ఆవిష్కరించిన కవిత

సారాంశం

కేసిఆర్ ఆలోచనలు, పథకాలు ప్రతిబించేలా ఆల్బమ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ యూత్ విభాగం రూపొందించిన వీడియో సాంగ్ ఆల్బమ్ ను కేసిఆర్ కూతరు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.

సీఎం ఆలోచన ల ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పథకాల వివరాలు, వాటి ఫలాలను తెలియజెప్పే లా వీడియో ఆల్బమ్ ను రూపొందించిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎం.ఎల్. సి శంభీపూర్ రాజును ఎంపి కవిత అభినందించారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి వివేకానంద గౌడ్, కార్పోటర్లు జగన్, సత్యనారాయణ, రావుల శేషగిరి, ఎం.డి రఫీక్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, టిఆర్ఎస్  కుత్బుల్లాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?