నాన్నకు ప్రేమతో.. జగిత్యాలను కానుకగా ఇచ్చిన కవిత

By ramya neerukondaFirst Published Dec 11, 2018, 11:47 AM IST
Highlights

ఇప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గాన్ని జీవన్ రెడ్డి, ఎల్.రమణలు రాజకీయంగా శాసిస్తోండగా..వారికి ఈ ఎన్నికల్లో కవిత చెక్ పెట్టింది.
 


నిజామామాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.. జగిత్యాలలో తన పంతం నెగ్గించుకున్నారు. జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ ని కవిత.. దగ్గరుండి మరీ గెలిపించారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఓటమి ఎదురైంది. ఇప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గాన్ని జీవన్ రెడ్డి, ఎల్.రమణలు రాజకీయంగా శాసిస్తోండగా..వారికి ఈ ఎన్నికల్లో కవిత చెక్ పెట్టింది.

ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డి కోసం.. ఎల్.రమణ తన టికెట్ త్యాగం చేసినప్పటికీ.. లాభం లేకుండా పోయింది. జీవన్ రెడ్డిని ఓడించి.. జగిత్యాల నియోజకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ వేసిన ప్లాన్ లు ఫలించాయి.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగలిగింది. కేవలం జగిత్యాల మాత్రం టీఆర్ఎస్ కి దక్కలేదు.

అందుకే ఈ ఎన్నికల్లో జగిత్యాలను దక్కించుకోవడానికి నిజామాబాద్ ఎంపీ కవిత రంగంలోకి దిగారు. తమ పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జీవన్ రెడ్డి వర్సెస్ కవిత లాగా.. ఎన్నికల ప్రచారం సాగింది. 2014లో టీఆర్ఎస్ గెలిచిన నాటి నుంచే జిగిత్యాలపై ఆమె ప్రత్యేక దృష్టిసారించారు. పలుమార్లు నియోజకవర్గ పర్యటన చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆమె జగిత్యాలలో విస్తృతంగా పర్యటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో సంజయ్ ని గెలిపించి.. కవిత తన పంతం నెగ్గించుకున్నారని నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. 

click me!