మహారాష్ట్రలోని 40మంది సర్పంచ్‌లు కలుస్తామంటున్నారు: కవిత (వీడియో)

By Arun Kumar PFirst Published Dec 4, 2018, 6:41 PM IST
Highlights

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే సమయం మిగిలుంది. దీంతో ప్రముఖ పార్టీలన్ని ప్రచార వేగాన్ని పెంచాయి. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇలా నిజామాబాద్ ఎంపి కవిత  ఇవాళ కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి విద్యాసాగర రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం , మల్లాపూర్, మెట్‌పల్లి టౌన్ రోడ్ షో లలో కవిత పాల్గొన్నారు.   
               
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.... 60 ఏళ్లలో  ఏ ప్రభుత్వం చేయని పనులను కేవలం నాలుగేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని ప్రశంసించారు. అది తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ కు ఉన్న ప్రేమ అభిమానాలకు నిదర్శనమని అన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర ఇతర రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలిస్తున్నారని కవిత వివరించారు. మన పొరుగున ఉన్న మహారాష్ట్ర లోని 40 గ్రామాల సర్పంచ్‌లు మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోవాలని కోరారని...ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కు లభించిన ప్రశంస అని కవిత కొనియాడారు. 

కేసీఆర్ ను గద్దె దించాలని కూటమి కట్టిన నాయకులు ఆయన ఎందుకు గద్దె దించాలని అనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించాలని ప్రజలకు కవిత సూచించారు. 24 గంటలపాటు కరెంటు ఇస్తున్నందుకా.. రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నందుకా.. కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేస్తున్నందుకా... కేసిఆర్ కిట్ ద్వారా పేదింటి గర్భిణీలకు పురుడుపోసి.. మగ పిల్లాడు పుడితే 12000 ఆడపిల్ల పుడితే 13000 ఇస్తున్నందుకా, పెన్షన్లను డబుల్ చేస్తామని చెప్పినందుకా, ఎందుకోసం కేసీఆర్ ను గద్దె దించాలో కూటమి నేతలు చెప్పాలన్నారు. 

వీడియో

"

click me!