కదులుతున్న రైల్లోంచి కన్న కూతురిని విసిరేసి... కసాయి తల్లి కర్కశత్వం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 09, 2021, 11:17 AM ISTUpdated : Jul 09, 2021, 12:07 PM IST
కదులుతున్న రైల్లోంచి కన్న కూతురిని విసిరేసి... కసాయి తల్లి కర్కశత్వం (వీడియో)

సారాంశం

కన్న కూతురిని వేగంగా వెళుతున్న రైల్లోంచి కిందకు విసిరేసి చంపడానికి ప్రయత్నించింది ఓ కసాయి తల్లి. 

పెద్దపల్లి: ప్రేగు బంధాన్ని, కడుపు తీపిని మరిచిన కసాయి తల్లి అత్యంత కర్కషంగా ప్రవర్తించింది. కన్న కూతురిని వేగంగా వెళుతున్న రైల్లోంచి కిందకు విసిరేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చే సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... అసలే ఆడపిల్ల... అదీ అంగవైకల్యంతో పుట్టింది. దీంతో కడుపునపుట్టిన కూతురని కూడా చూడకుండి వదిలించుకోవాలని చూసింది కసాయి తల్లి. ఇందులోభాగంగా చిన్నారిని అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించింది. ఇందుకోసమే అభం శుభం తెలియన చిన్నారితో రైలెక్కింది.

read more  కట్టుకున్న భార్యను కత్తితో గొంతుకోసి...ఇంటికి తాళంవేసి వెళ్లిన భర్త.. !

ఈ క్రమంలోనే పెద్దపల్లి మండలం గొల్లపల్లి వద్ద వేగంగా వెళుతున్న రైల్లోంచి ఒక్కసారిగా చిన్నారిని విసిరేసింది. అయితే రైలు పట్టాల వద్ద తీవ్రంగా గాయపడిన చిన్నారిని గుర్తించిన స్థానికులు  పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

వీడియో

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన మహిళను గుర్తించేపనిలో పడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్