మెదక్ జిల్లాలో విషాదం... కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలతో కన్నతల్లి ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : Nov 16, 2021, 12:33 PM IST
మెదక్ జిల్లాలో విషాదం... కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలతో కన్నతల్లి ఆత్మహత్య

సారాంశం

అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పిల్లలతో కలిసి తల్లికూడా చెరువులో దూకడంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

మెదక్: నమమాసాలు మోసి జన్మనిచ్చి... అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు బిడ్డలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవపడి క్షణికావేశానికి లోనయిన మహిళ దారుణానికి ఒడిగట్టింది. తన ప్రాణాలు తీసుకోవడమే కాదు అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలనూ బలిచేసింది. ఈ దారుణం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. medak district టేక్మాల్ మండలం దాదాయిపల్లి గ్రామానికి చెందిన రాజు-రజిత దంపతులు. వీరికి రిశ్వంత్(4), రక్షిత(2) సంతానం. పిల్లాపాపలతో ఆనందంగా సాగుతున్న వీరి సంసారంలో ఇటీవల అలజడి రేగింది. భార్యాభర్తల మనస్పర్దలు పెరిగి తరచూ గొడవలు జరుగుతుండేవి. 

ఇలా సోమవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన రజిత క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది. అదే రాత్రి ఇద్దరు బిడ్డలతో కలిసి గ్రామ శివారులోని చెరువువద్దకు వెళ్లి suicide చేసుకుంది. 

read more  ట్రైనింగ్ లో భార్య... కత్తిపీటతో గొంతు కోసుకుని భర్త ఆత్మహత్యాయత్నం.. !!

భార్యాపిల్లలు కనిపించకపోవడంతో రాజు ఇంటిచుట్టుపక్కల వెతికాడు. అయినా వారు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులకు తెలిపారు. దీంతో అందరూ కలిసి వెతికినా తల్లీబిడ్డల ఆఛూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

అయితే ఇవాళ ఉదయం చెరువులో చిన్నారులిద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. నీటిపై తేలుతున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీసారు. తల్లి మృతదేహం కోసం గ్రామస్తులు చెరువులో గాలిస్తున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా చెరువువద్దకు చేరుకున్నారు. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. భార్యాపిల్లల మృతితో రాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. 

read more  అమీర్‌పేట మెట్రోస్టేషన్ నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలింపు

ఇదిలావుంటే కొడుకు మృతిని తట్టుకోలేక ఓ తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య చేసుకున్న ఘటన  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరంలో వెంకట కార్తీక్ అనే యువకుడు తన తల్లి ఇందిరాప్రియ, అమ్మమ్మ రాధాకృష్ణకుమారితో కలిసి నివాసం ఉండేవాడు. తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబపోషణ భారం పూర్తిగా కార్తీక్ పై పడింది. 

భీమవరంలోనే అక్వేరియం వ్యాపారాన్ని కార్తీక్ నిర్వహించేవాడు. ఈ వ్యాపార పనుల నిమిత్తం కార్తీక్ తరచుగా విజయవాడకు వచ్చేవాడు. ఈ నెల 7వ తేదీన కూడా కార్తీక్ విజయవాడ గవర్నర్ పేట పిన్నెలవారివీధిలోని ఓ లాడ్జీలో దిగాడు.  రాత్రి లాడ్జిలో పనిచేసే సిబ్బంది ద్వారా సిగరెట్లు తెప్పించుకొన్నాడు. ఈ నెల 8వ తేదీన కార్తీక్ తన గది తలుపులు తెరవలేదు.  దీంతో లాడ్జిలో పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఈ సమాచారం అందుకొన్న పోలీసులు లాడ్జిలో పనిచేసే సిబ్బంది సహాయంతో తలుపులు పగులకొట్టారు. అయితే గదిలో కార్తీక్ ఉరేసుకొని మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు. కార్తీక్ గదిలో ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు Bhimavaramలో  ఉన్న కార్తీక్ తల్లికి సమాచారం అందించారు.

ఈ విషయం తెలుసుకొన్న Kartik తల్లి Indira Priya, అమ్మమ్మ Radha Krishna Kumari లో మనోవేదకు గురయ్యారు. ఈ నెల 9వ తేదీన ఇందిరాప్రియ, రాధాకృష్ణకుమారిలు తమ ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని Suicide చేసుకొన్నారు. కొడుకు మరణించిన గంటల వ్యవధిలోనే తల్లి, అమ్మమ్మలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్