ఫ్లాష్..ఫ్లాష్.. రైతుబంధు పథకంలో నగదు బదిలీ నిలిపివేత

By sivanagaprasad kodatiFirst Published Nov 5, 2018, 9:28 AM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో భాగంగా నగదు బదిలీ కార్యక్రమం నిలిచిపోయింది. ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్నవారికే ఇప్పుడు నగదు బదిలీ చేయాలని.. కొత్త లబ్ధిదారులను చేర్చవద్దని ఎన్నికల సంఘం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించడంతో... మొత్తం 4.90 లక్షల మంది రైతులకు నగదు బదిలీ నిలిచిపోయింది. 

ఈసీ ఆదేశాల మేరకు 2 లక్షల మంది కొత్తవారిని పక్కనబెట్టగా... గత సీజన్‌లో చెక్కులు అందుకున్న వారిలో 2.90 లక్షల మందికి ఇప్పటికీ పాసుపుస్తకాలు అందలేదు. తమకు గత ఖరీఫ్‌లో చెక్కు ఇచ్చి ఇప్పుడు ఎందుకు నగదు జమ చేయడం లేదంటూ రైతులు వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.  

మరోవైపు కొన్ని జిల్లాల్లో కంపెనీలు, ట్రస్టులు, సంస్థల పేరుతో ఉన్న భూములకు సైతం వ్యక్తి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలోకి రైతుబంధు నిధులు వెళుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. భూపరిమితి చట్టం ప్రకారం ఒకరి ఖాతాలో 56 ఎకరాలకు అంటే రూ.2.20 లక్షలకు మించి నగదు జమ చేయకుండా ఆంక్షలు విధించారు.

click me!