తబ్లిగీ జమాత్ మీద కేసు: హైదరాబాదులో నాలుగు చోట్ల ఈడీ సోదాలు

By telugu teamFirst Published Aug 20, 2020, 9:19 AM IST
Highlights

తబ్లిగీ జమాత్ మీద నమోదైన కేసులో ఈడీ దేశంలోని పలు చోట్ల సోదాలు చేస్తోంది. హైదరాబాదులో నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కందాల్వీపై నమోదైన కేసులో ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) దేశంలోని పలు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. హవాలా ద్వారా డబ్బులు మళ్లించారనే ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాదుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాదులో నాలుగు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. 

ఢిల్లీలో మౌలానాపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 8 మంది కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సాక్ష్యాల సేకరణకు ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ పోలీసుల కేసును ఆధారం చేసుకుని ఈడీ ఏప్రిల్ లో కేసు నమోదు చేసింది. కరోనా వ్యాప్తిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించి మౌలానా మతపరమైన సమావేశం నిర్వహించారనే ఆరోపణపై మౌలానాపై, సంస్థ ఆఫీస్ బియరర్లపై, కొంత మంది అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈ కేసును ఈడీ తన చేతుల్లోకి తీసుకుంది. జమాత్ పేరు మీద పెద్ద యెత్తున విరాళాలు వసూలు చేశారని, వాటిని మౌలానా వ్యక్తిగత ఖాతాకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి 

click me!