ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్: హర్షవర్ధన్ రెడ్డి,రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు

By narsimha lode  |  First Published Nov 13, 2022, 10:44 AM IST

తమకు బెదిరింపు ఫోన్ కాల్స్  వస్తున్నాయని కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ  విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి  కూడా తీసుకెళ్లారు.


హైదరాబాద్:మొయినాబాద్ ఫాంహౌస్ ఫాంహౌస్ కేసులో ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి.ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. ఇదే  విషయమై తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి పోలీసులకు  పిర్యాదు  చేశారు. మరోవైపు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి కూడ ఇదే విషయమై బెదిరింపుకాల్స్ వచ్చినట్టుగా సమాచారం.ఈ విషయమై ఆయన కూడా  పోలీసులకు ఫిర్యాదు  చేశారని సమాచారం.గుజరాత్, యూపీల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు  కకూడా  బెదిరింపు ఫోన్లు వచ్చినట్టుగా  ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.బెదిరింపు ఫోన్ కాల్స్ అంశాన్ని ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. 

ఫాంహౌస్ కేసులో ముగ్గురు నిందితులను ట్రాప్ చేసి పోలీసులకు పట్టించిన నలుగురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించింది. నలుగురికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు,ఎస్కార్టు, ఇంటి వద్ద భద్రతను కేటాయించారు.అంతేకాదు ప్రస్తుతం ఉన్న భద్రతను 4+4కి పెంచారు.తొలుత పైలెట్ రోహిత్ రెడ్డికి మాత్రమే భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.కానీ ఆతర్వాత మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు  కూడా భద్రతను పెంచింది ప్రభుత్వం.

Latest Videos

undefined

గత నెల 26న మొయినాబాద్  ఫాం  హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముగ్గురు నిందితులు  ప్రలోభాలకు గురిచేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట  ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు,కొల్లాపూర్ ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి లను రామచంద్రభారతి,సింహయాజీ,నందకుమార్ లు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి.  ఇదే విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకుపోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు:రోహిత్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డుచేసిన సిట్

ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక  బీజేపీ ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. తమ పార్టీలో చేర్చుకోవాలంటే నేరుగా చేర్చుకొంటామని ఆ పార్టీ ప్రకటించింది.మధ్యవర్తులను పెట్టి పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా బీజేపీ తేల్చి చెప్పింది.మొయినాబాద్ ఫాం హౌస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది.మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు పార్టీలు ఈ అంశంపై పరస్పరం విమర్శలు,ప్రతి విమర్శలకుదిగాయి.ఈ కేసును సిట్టింగ్ జడ్జి  లేదా  సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ  కోరుతుంది.  ఈ కేసు విచారణ కోసం  తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. సిట్ విచారణను నిలిపివేయాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

click me!