కులం కారణంగానే మా పెళ్లి చేయలేదు: మోహనకృష్ణ మృతిపై వికాస్

Published : Dec 02, 2022, 06:34 PM ISTUpdated : Dec 02, 2022, 06:47 PM IST
కులం కారణంగానే  మా పెళ్లి చేయలేదు: మోహనకృష్ణ మృతిపై  వికాస్

సారాంశం

చంద్రగిరిరెడ్డివారిపల్లెకు చెందిన ఇంటర్ విద్యార్ధిని మోహనకృష్ణది హత్యగా  పోస్టుమార్టం నివేదిక తేల్చింది.  కులం కారణంగానే మోహనకృష్ణను తనకు ఇచ్చి వివాహం చేయలేదని వికాస్  ఆరోపించారు.   

తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిరెడ్డివారిపల్లెలో ఇంటర్ విద్యార్ధిని మోహనకృష్ణది హత్యగా పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కులం కారణంగానే  తనతో  మోహనకృష్ణ వివాహం చేయలేదని  వికాస్ ఆరోపించారు. తామిద్దరం పెళ్లి చేసుకోవాలని భావించినట్టుగా  కూడా వికాస్  చెప్పారు.

also read:తిరుపతి జిల్లాలో పరువు హత్య?.. ఇంటర్ విద్యార్థిని మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

చంద్రగిరిరెడ్డివారిపల్లెలో  ఇంటర్ విద్యార్ధిని  మోహనకృష్ణ మృతిపై వికాస్  శుక్రవారంనాడు ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.  మోహనకృష్ణ, తాను ప్రేమించుకున్నట్టుగా చెప్పారు. వారం రోజుల పాటు మోహనకృష్ణ తమ ఇంట్లోనే ఉందన్నారు. అయితే మోహనకృష్ణను ఇచ్చి వివాహం చేయాలని తమ కుటుంబసభ్యులు  యువతి ఇంటికి వెళ్లి అడిగారన్నారు. తొలుత వివాహనికి ఒప్పుకున్నట్టుగానే ఒప్పుకొని ఆ ఆతర్వాత  మోహనకృష్ణు తీసుకెళ్లారన్నారు. తామిద్దరం పెళ్లి చేసుకునేందుకు ముహుర్తం కూడా  ఫిక్స్  చేసుకున్నామన్నారు. కానీ ఈ లోపుగా  కేసు పెట్టి  మోహనకృష్ణను తీసుకెల్లారని వికాస్  చెప్పారు. మోహనకృష్ణ చనిపోయిన వారం రోజులకు తనకు విషయం తెలిసిందన్నారు. తనను తమ బంధువుల ఇంటికి తీసుకెళ్లారని  వికాస్  వివరించారు. ప్రేమ విఫలం కావడంతో  మోహనకృష్ణ ఆత్మహత్య చేసుకుందని పేరేంట్స్ నమ్మించే ప్రయరత్నం చేశారు.మోహనకృష్ణది హత్య అని పోస్టుమార్టం రిపోర్టు తేల్చింది. కులం కారణంగానే మోహనకృష్ణను తనకు ఇచ్చి పెళ్లి చేసేందుకు వాళ్ల కుటుంబసభ్యులు అంగీకరించలేదన్నారు.

మోహనకృష్ణ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోహనకృష్ణను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ దిశగా  దర్యాప్తు చేస్తున్నారు. మోహనకృష్ణ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహరమే కారణమా ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే విషయమమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారుదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ తరహ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలోని సివల్ పేరిలో  19 ఏళ్ల కూతురు అరుణను తల్లి ఆరుముగకని  చంపింది. తన ప్రేమ విషయాన్ని తల్లికి చెప్పింది. ఈ విషయమై మాట్లాడేందుకు ఇంటికి పిలిపించింది. వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో పెళ్లి వద్దని చెప్పింది. తమ సామాజిక వర్గానికి చెందిన  యువకుడితో అరుణకు పెళ్లి చేస్తానని  చెప్పింది.ఈ విషయమై తల్లీ కూతురికి మధ్య గొడవ జరిగింది.ఈ సమయంలో కోపంతో అరుణను తల్లి గొంతునులిమి చంపింది.ఈ ఘటన ఈ నెల 24న జరిగింది.ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని విశాఖపట్టణంలో తన కూతురు ప్రేమించిందని  కూతురు చంపాడు తండ్రి, అంతేకాదు  ఈ విషయాన్ని సెల్పీ వీడియో తీసి బంధువులకు పంపాడు. తన పెద్ద కుమార్తె కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం, చిన్న కూతురు కూడా ప్రేమ విషయం బయటకు రావడంతో తట్టుకోలేక చంపేసినట్టుగా వరప్రసాద్  సెల్పీ వీడియోలో చెప్పారు.ఈ  ఘటన ఈ నెల 5న జరిగింది.

PREV
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu