అంతర్జాతీయ చాయ్ దినోత్సవం.. కవిత స్పెషల్ ట్వీట్

Published : Dec 15, 2020, 01:55 PM IST
అంతర్జాతీయ చాయ్ దినోత్సవం.. కవిత స్పెషల్ ట్వీట్

సారాంశం

ఈ అంతర్జాతీయ ఛాయ్ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఈ ప్రపంచంలో అత్యధిక శాతం మంది ప్రతి రోజు తమ ఉదయాన్ని ఓ ఛాయ్ తోనే ప్రారంభిస్తారు. అయితే నేడు అలాంటి ఛాయ్ యొక్క అంతర్జాతీయ దినోత్సవం. 

డిసెంబర్ 15 న ఇంటర్నేషనల్ టీ డే (International Tea Day 2020) సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కార్మికులకు మరియు రైతులకు టీ వ్యాపారం వల్ల కలిగే ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ రోజు జరుపుకుంటారు. భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మలేషియా, కెన్యా, వియత్నాం, ఇండోనేషియా, ఉగాండా, టాంజానియా సహాలు పలు దేశాలు ప్రతి ఏడాది ఈరోజున అంతర్జాతీయ చాయ్ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.

 

ఈ అంతర్జాతీయ ఛాయ్ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. ''బిజీ షెడ్యూల్ మధ్యలో, కప్పు అల్లం ఛాయ్ తాగితే, మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. టీ తాగుతున్న సెల్ఫీని ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన ఎమ్మెల్సీ కవిత, మీరు సైతం టీ తాగుతూ సెల్ఫీ షేర్ చేయాలని నెటిజెన్లను కోరారు.
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!