గత ప్రభుత్వాలు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించేవి.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

Published : Oct 01, 2023, 10:57 PM IST
గత ప్రభుత్వాలు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించేవి.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

సారాంశం

MLC Kavitha | తెలంగాణలో ఎస్టీలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశామనీ, వారి రిజర్వేషన్లు 10 శాతం వరకు పెంచిన ఘతన సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) వ్యాఖ్యానించారు. ఎస్టీ(ST)లకు 90 వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం తమదేననీ,  ఏ ప్రభుత్వం తీసుకురాని సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

MLC Kavitha | ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 90 వేల కోట్లు నిధులకు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని, గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘతన సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పష్టం చేశారు. తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను పెంచడంతో వారికి విద్యా ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలను కల్పించామని తెలిపారు.

ఆదివారం నాడు నిజామాబాద్లో బంజారా భవనం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పెరిగిన గిరిజనులకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ భావించారనీ, ఈ మేరకు 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే.. మోడీ సర్కార్ తిరస్కరించారనీ, వారి  రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదని ప్రధాని మోదీ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఎస్టీల రిజర్వేషన్ 10 శాతానికి పెంచడంతో వారి విద్యలో, ఉపాధిలో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. రిజర్వేషన్ పెంచిన తర్వాత దాదాపు 3,985 మంది గిరిజన బిడ్డలకు అదనంగా ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయని, 195 మందికి మెడికల్ కాలేజీల్లో అదనంగా సీట్లు లభించాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గిరిజన బిడ్డల బాగు కోసమే సీఎం కేసీఆర్ రిజర్వేషన్లను పెంచారని, ఆయన ఎలాంటి రాజకీయ లబ్ది ఆశించలేదని అన్నారు. నిర్ణయం వల్ల గిరిజనుల తరతరాల్లో మార్పు వస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వాలు ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించే నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించేవని అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కానీ గత పదేండ్లలో ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 90 వేల కోట్లు కేటాయించమని తెలిపారు. పోడుపట్టాలు, రైతు బంధు, రైతు బీమా, ఫీజు రియింబర్స్ మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను గిరిజనులకు అందిస్తున్నామని అన్నారు.  

60 ఏండ్ల పాలన చేసిన కాంగ్రెస్ 90 పాఠశాలలను ఏర్పాటు చేస్తే.. కేవలం తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో 190 పాఠశాలలను ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రతీ జిల్లా కేంద్రంలో హాస్టల్ తో కూడిన డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశామనీ, దేశవ్యాప్తంగా ఇలాంటి సదుపాయాలు కల్పించిన రాష్ట్రం కేవలం తెలంగాణనే అని ప్రశసించారు. సమ్మక్క సారక్క మేడారం జాతరకు ఇప్పటి వరకు రూ. 400 కోట్లు ఇచ్చామని, 3200పైగా తండాలను గ్రామ పంచాయతీ హోదా కల్పించామని అన్నారు. బంజారాల కోసం సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎన్నో పనులు చేసిందని, రాష్ట్రంలో 10 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి వచ్చిందని అన్నారు.  

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వరంగల్ ప్రాంతంలోని ఓ తండాలో పర్యటించినప్పడూ.. అక్కడే ఇళ్లు దగ్దమయ్యి బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న డబ్బు కాలిపోయడంతో వారు సీఎం కేసీఆర్ ను ఆశ్రయించగా.. వారికి కేసీఆర్ రూ. 50 వేలు ఇచ్చారనీ, ఆ రోజు వారి సంతోషానికి మాటల్లో చెప్పలేమని, ఆ పని స్పూర్తిగానే సీఎం కేసీఆర్ తెలంగాణలో కళ్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేశారని వివరించారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్