Munugode bypoll 2022: పాల్వాయి స్రవంతితో కాంగ్రెస్ అగ్రనేతల చర్చలు

By narsimha lodeFirst Published Aug 12, 2022, 1:23 PM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతితో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. పార్టీ నేతలు బోస్ రాజు, జావెద్ లు ఆమెతో చర్చలు జరుపుతున్నారు.

హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతితో పార్టీ అగ్రనేతలు శుక్రవారం నాడు చర్చిస్తున్నారు.  పార్టీ  జాతీయ నేతలు బోస్ రాజు, జావెద్ లు పాల్వాయి స్రవంతితో చర్చిస్తున్నారు. 

ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజులకు కాంగ్రెస్ పార్టీ చీఫో సోనియా గాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపారు.ఈ నెల 8వ తేదీన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా లేఖను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందించారు. రాజీనామా లేఖను అందించిన క్షణాల్లోనే ఈ రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి గతంలో పలు దఫాలు ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి టికెట్ ను ఆశిస్తున్నారు. గతంలో కూడా పాల్వాయి స్రవంతి ఈ స్థానం నుండి టికెట్ ను ఆశించినా ఆమెకు టికెట్ దక్కలేదు. ఈ దఫా జరిగే ఉప ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని పాల్వాయి స్రవంతి పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పాల్వాయి స్రవంతి జరిపిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్  గా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుండి తనకు టికెట్ ఇవ్వకపోతే తాను తీవ్ర నిర్ణయం తీసుకొంటానని కూడా పాల్వాయి స్రవంతి తన అనుచరుల వద్ద చెప్పినట్టుగా ప్రచారం సాగుతుంది. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపనున్నాయి. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ఝిని ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు.  అయితే పాల్వాయి స్రవంతి మాత్రం ఈ దఫా  టికెట్ కోసం ఆశతో ఉన్నారు.  చలమల కృష్ణారెడ్డి కూడా  కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.  బీసీ సామాజిక వర్గం నుండి కైలాస్, పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్ ల పేర్లను కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది.

also read:నన్నుహోంగార్డుతో పోల్చారు, పార్టీ నుండి పంపే ప్రయత్నం: రేవంత్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్

దరిమిలా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్వాయి స్రవంతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా కూడా పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొన్నామని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీ నాయకత్వంపై ఉంది. దీంతో ఈ స్థానంలో విజయం కోసం కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.

చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా తప్పు బడుతున్నారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన సుధాకర్ ను పార్టీలో ఎలా చేర్చుకొంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా పార్టీలో చేర్చుకొన్న వారికి టికెట్ ఇవ్వవద్దని  ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ నియోజకవర్గంలో బీసీలకు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. 
 

click me!