ఎప్పటికీ ఉండేది టీఆర్ఎస్ పార్టీనే.. ఆ బాధ్యత ప్రజలదే: ఎమ్మెల్సీ కవిత

By Sumanth KanukulaFirst Published Dec 4, 2022, 4:11 PM IST
Highlights

సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసిన అంతిమంగా  ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసిన అంతిమంగా  ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని చెప్పారు. ఆదివారం ఆలేరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..రకరకాల పార్టీలు వస్తూ ఉన్నాయి కాని ఎప్పటికీ ఉండేది టీఆర్ఎస్ పార్టీనే అని ఆమె చెప్పారు. ఉద్యమ సమయంలో కూడా సమైక్యవాదులు ఉద్యమాన్ని ఆగం చేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతోని ఉద్యమాన్ని నడిపారని.. గమ్యాన్ని చేరుకున్నారని చెప్పారు. 

గొంగిడి సునీత జడ్పీటీసీ స్థాయి నుంచి ప్రభుత్వ చీప్ విప్‭గా ఎదగడానికి  యాదాద్రి జిల్లా ప్రజలే ముఖ్య కారణమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత యాదాద్రి జిల్లా ప్రజలదేనని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమాల ఖిల్లా అని.. టీఆర్ఎస్ కంచుకోట అని అన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యాదాద్రి గురించి చెప్పుకుంటున్నారని అన్నారు. యాదాద్రి వరల్డ్ క్లాస్ టూరిస్ట్ సెంటర్‌గా ఎదగబోతుందని అన్నారు. 

ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి ఈ నోటీసులు జారీచేశారు. ఆమె సౌకర్యార్థం హైదరాబాద్‌లోని నివాసంలో గానీ, ఢిల్లీలోని నివాసంలో గానీ ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారించాలని అనకుంటున్నామని చెప్పారు. విచారణ ప్రదేశాన్ని తెలియజేయాని కోరారు. అయితే దీనిపై స్పందించిన హైదరాబాద్‌లోని నివాసంలో విచారణ అధికారులకు సమాధానమిస్తానని చెప్పారు. అయితే  శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అనంతరం సీబీఐకి కవిత లేఖ రాశారు. 

ఢిల్లీ  లిక్కర్ స్కామ్‌పై వచ్చిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ ప్రతులను ఇవ్వాలని లేఖలో సీబీఐని కవిత కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని  తెలిపారు. తనకు పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్‌లో సమావేశ తేదీని ఖరారు చేయవచ్చని పేర్కొన్నారు. 

click me!