మన దగ్గర దొరికిన వాళ్లను విచారణ చేయొద్దా?.. బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడు?: ఎమ్మెల్సీ కవిత

By Sumanth KanukulaFirst Published Nov 23, 2022, 3:44 PM IST
Highlights

టీఆర్ఎస్ నాయకులు, వారి సన్నిహితులపై ఈడీ, ఐటీ దాడులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ అధికారులు పిలిస్తే తెలంగాణ మంత్రులు విచారణకు వెళ్తున్నారని.. అయితే ఇక్కడ దొరికిన వాళ్లను విచారణ చేయొద్దా అని ప్రశ్నించారు. 

టీఆర్ఎస్ నాయకులు, వారి సన్నిహితులపై ఈడీ, ఐటీ దాడులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ అధికారులు పిలిస్తే తెలంగాణ మంత్రులు విచారణకు వెళ్తున్నారని.. అయితే ఇక్కడ దొరికిన వాళ్లను విచారణ చేయొద్దా అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీకి లీడర్ లేడని, ఐడీయాలజీ లేదని, ప్రజలల్లో లేరని విమర్శించారు. ఇతర పార్టీల లీడర్లను ప్రలోభ పెడుతున్నారని.. లేదంటే ఈడీ, ఐటీ అని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా గట్టిగా ఉన్నవాళ్లను గద్దలలెక్క తన్నుకుపోవాలనేదే బీజేపీ ప్లాన్ అని విమర్శించారు. 

తెలంగాణలో నెల రోజుల నుంచి ఐటీ దాడులు చేస్తున్నారని.. ఒక్క మంత్రిని, ఒక ఎమ్మెల్యే, ఎంపీని విడిచిపెడతలేరని అన్నారు. తమకు ఎలాంటి భయం లేదని చెప్పారు. వాళ్లు వ్యాపారం చేస్తున్నారని, లీగల్‌గా చేస్తున్నారని.. అధికారులు వచ్చి అడిగితే పత్రాలు ఇస్తారని, జవాబు చెబుతారని అన్నారు. ఏం చేస్తారో చేసుకోనుండి.. తెలంగాణ ప్రజలు భయపడరని చెప్పారు.  

తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి వస్తే అందులో బీఎల్ సంతోష్ పేరు వినిపించిందని విచారణకు పిలిస్తే.. ఎందుకు అంత భయపడుతున్నారని ప్రశ్నించారు. బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయద్దని కోర్టుకు వెళ్లారని.. అరెస్ట్ చేయద్దని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ విచారణకు రావడం లేదన్నారు. ‘‘మన దగ్గర దొరికిన దొంగల మీద విచారణ చేయద్దా?‘‘ అని ప్రశ్నించారు. 

తమకు ఏం సంబంధం లేదని చెప్పేవారు కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. యాదగిరి గుట్ట పోయి బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేశారని.. నిన్న ఆయన ఎందుకు ఏడ్చాడో అర్థం కాలేదని అన్నారు. దొంగతనం చేస్తూ దొరికినొళ్లను అరెస్ట్ చేయవద్దా అని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ విచారణకు పిలిస్తే తెలంగాణ మంత్రులు వెళ్తున్నారని.. దొంగతనం చేయని వాళ్లు ఎందుకు భయపడతారని అన్నారు. బీజేపీ నేతలు రాముడు పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. 

click me!