మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్.. పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని ట్వీట్..

Published : Feb 14, 2022, 02:17 PM IST
మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్.. పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని ట్వీట్..

సారాంశం

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాకూర్ (Manickam Tagore) వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత కౌంటర్ (Kalvakuntla Kavitha) ఇచ్చారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదన్న కవిత.. మాణిక్కం ఠాకూర్ చేసిన వ్యాఖ్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాకూర్ (Manickam Tagore) వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత కౌంటర్ (Kalvakuntla Kavitha) ఇచ్చారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదన్న కవిత.. మాణిక్కం ఠాకూర్ చేసిన వ్యాఖ్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు. అది గిఫ్ట్ కాదు అని క‌విత తెలిపారు. నిజమైన పోరాటం గెలించిందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారని అన్నారు. 

తొలుత మాణిక్కం ఠాకూర్.. తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ కాంగ్రెస్ టీమ్.. కొట్లాది మంది తెలంగాణ యువత, సోనియమ్మ కోరుకున్న తెలంగాణ కోసం పని చేస్తూనే ఉంటుంది. కానీ ఏడేళ్లలో అలా జరగలేదు. అది నెరవేరాలంటే  ఊసరవెల్లి టీఆర్‌ఎస్, మతతత్వ బీజేపీని ఓడించాలి. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి 2 పార్శ్వాలు. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయగలదు’ అని ట్వీట్ చేశారు.

 

దీనిపై స్పందించిన కవిత.. తెలంగాణ కోసం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదని తెలిపారు. భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు. అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం అని క‌విత పేర్కొన్నారు. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాల‌ని ఠాగూర్‌కు క‌విత సూచించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu