
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ బండ ప్రకాష్ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 12న డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 11వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ క్రమంలోనే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు.
ఈ నేపథ్యంలో బండ ప్రకాష్ శనివారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక, ఇతరులు ఎవరూ డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ పడే దాఖలాలు కనిపించడం లేదు. దీంతో బండ ప్రకాష్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నేతి విద్యాసాగర్ రావు పదవికాలం 2021 జూన్ 3న పూర్తయింది. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.
ఇక, బండ ప్రకాష్ 2018 మార్చిలో బీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే 2021 నవంబర్ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో తన పదవికాలం పూర్తికాకముందే రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాష్ రాజీనామా చేశారు.