ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు .. చర్యలు తీసుకోండి : షర్మిలపై స్పీకర్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు

By Siva KodatiFirst Published Sep 13, 2022, 7:10 PM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, వైఎస్ షర్మిలపై నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు.

వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, వైఎస్ షర్మిలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వీరిలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు వున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై చర్చలు తీసుకునే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు. 

ఇకపోతే.. ఇక, వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. గత శుక్రవారం మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిలో ప్రవేశించింది. ఈ సందర్భంగా గతంలో నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాను నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరాహార దీక్షలు చేస్తుంటే.. నిరంజన్ రెడ్డి తనను మంగళవారం మరదలు అన్నారని గుర్తుచేసుకున్న షర్మిల.. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అని అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప‌రాయి స్త్రీలో త‌ల్లిని, చెల్లిని చూడ‌లేని సంస్కార హీనుడు నిరంజ‌న్ రెడ్డి అని అన్నారు. . ఆయనకు కుక్కకు ఏమైనా తేడా ఉందా అని మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  అధికార మదం తలకెక్కిందా... నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Also REad:ఎవడ్రా నీకు మరదలు.. కుక్కకు నీకు తేడా వుందా : మంత్రి నిరంజన్ రెడ్డిపై షర్మిల ఆగ్రహం

ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని మండిపడ్డారు. ఒక్కమాటకు వందమాటలు అంటామని.. ఆత్మ‌విశ్వాసంతో చీల్చి చెండాడుతామ‌ని అన్నారు. ‘‘రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటి చేసి నీ సత్తా ఏంటో చూపించాలి’’ అని షర్మిలకు నిరంజన్ రెడ్డి సవాలు విసిరారు. 

తాను 22 ఏళ్లు తెలంగాణ జెండా పట్టుకుని.. ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే తన బిడ్డలను విదేశాల్లో చదివించానని తెలిపారు. తాము వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. ‘‘రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది’’ అంటూ షర్మిలపై నిరంజన్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి  ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తిని తాను అని చెప్పారు. 
 

click me!