ఇంటిపై పిడుగు: ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కు, ఫ్యామిలీకి తప్పిన ముప్పు

Published : Apr 09, 2020, 04:59 PM IST
ఇంటిపై పిడుగు: ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కు, ఫ్యామిలీకి తప్పిన ముప్పు

సారాంశం

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఆయన కుటుంబ సభ్యులు పిడుగుపాటు నుంచి తప్పించుకున్నారు. ఆయన ఇంటిపై గురువారం సాయంత్రం పిడుగు పడింది. ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు.

దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు, అతని కుటుంబానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన క్యాంప్ కార్యాలయంపై గురువారం పిడుగు పడింది. గురువారం సాయంత్రం తెలంగాణలోని పలు చోట్ల ఉరములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.

పిడుగు రవీంద్ర కుమార్ కార్యాలయం పెంట్ హౌస్ ను తాకింది. అయితే, ఆ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే కుటుంబం తప్పించుకుంది. ఈ రోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. 

హైదరాబాదులో భారీ వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. హైదరాబాదులోని మూసాపేట, కూకట్ పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అంబర్ పేట, నాంపల్లి ప్రాంతాల్లో కూడా వర్షాలు పడ్డాయి.

తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తిరుమల తిరుపతిలో కూడా ఉరములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!