సింగరేణి కార్మికుడికి, అతని కూతురికి పాజిటివ్: హైదరాబాదులో మెడికల్ షాపు యజమానికి....

By telugu teamFirst Published Apr 9, 2020, 3:47 PM IST
Highlights

సింగరేణిలో హై అలర్ట్ ప్రకటించారు. సింగరేణి కార్మికుడికీ అతని కూతురికీ కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అతను ఢిల్లీ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాదులో మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

హైదరాబాద్: సింగరేణిలో హై అలర్ట్ ప్రకటించారు. ఓ సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్దారణ అయింది. అతను మార్చి 19 నుంచి 30వ తేదీ వరకు విధుల్లో పాల్గొన్నాడు. అతనితో పాటు విధులు నిర్వహించిన కార్మికులను కూడా గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కార్మికుడి కూతురికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దాంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతను ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు.

హైదరాబాదులోని మాదాపూర్ సాయినగర్ మెడికల్ షాపు యజమానికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో మాదాపూర్ లోని పది మందిని క్వారంటైన్ కు తరలించారు. ఆ పది మందికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. 

తెలంగాణలో బుధవారం సాయంత్రానికి 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 11 మంది కరోనా వైరస్ సోకి మరణించారు. ఈ స్థితిలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగాంగానే మృతుల అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో 5,734కు చేరుకుంది.473 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 166కు చేరుకుంది. 

click me!