
కరీంనగర్: బైక్ ఇస్తేనే తాళి కడతానని పెళ్లి పీటలపై వరుడు అలిగి కూర్చున్నాడు. వరుడిని ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ వరుడు ససేమిరా అన్నారు. అయితే ఇదే వివాహనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. పెళ్లి కొడుకు బైక్ కోసం అలిగిన విషయం తెలుసుకున్నాడు. పెళ్లి కొడుకుకు రూ. 50 వేలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అందించాడు. బైక్ కు అవసరమైన మిగిలిన డబ్బులు కూడ అందిస్తానని కూడ రసమయి బాలకిషన్ వరుడికి హామీ ఇచ్చాడు. దీంతో వరుడు పెళ్లికి అంగీకరించాడు. వధువు మెడలో తాళి కట్టాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. శంకరపట్నం మండలం మొలంగూరులో ఘటన చోటు చేసుకుంది.
ఇరు కుటుంబాలు పెళ్లి నిశ్చితార్ధ: సమయంలో వరుడికి బైక్ పెడతామని మాటిచ్చారు. అయితే కొన్ని కారణాలతో పెళ్లి రోజున బైక్ఇ్వలేకపోయారు. దీంతో వరుడు అలిగి తాళి కట్టనని తేల్చి చెప్పాడు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోక్యం చేసుకోవడంతో పెళ్లి జరిగింది.