నాకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది.. : రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు..

Published : Aug 09, 2022, 04:56 PM IST
నాకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది.. : రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్  (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని అన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని అన్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా తనను ఉగ్రవాదులు చంపుతారని చెప్పారు. ఇక, గతంలో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినట్టుగా రాజా సింగ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఈ ఏడాది జూన్‌లో కూడా రాజాసింగ్ తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలియని ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.


ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ Har Ghar Tiranga ప్రచారంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో 80000 పైగా జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్టుగా రాజాసింగ్ చెప్పారు. ‘‘మేము జెండాతో ప్రతి ఇంటికి చేరుకుంటాం. ఆజాదికాఅమృతమహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుండి 15 వరకు వారి నివాసంలో జెండా ఎగురవేయమని వారిని అభ్యర్థిస్తాం’’అని రాజా సింగ్ ట్వీట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu