హామీలు నెరవేరుస్తానని అగ్రిమెంట్ రాసిచ్చిన.. ముత్తిరెడ్డి

Published : Nov 22, 2018, 04:20 PM IST
హామీలు నెరవేరుస్తానని అగ్రిమెంట్ రాసిచ్చిన.. ముత్తిరెడ్డి

సారాంశం

ఇచ్చిన హామీలను నెరవేరుస్తానంటూ ఎగ్రిమెంట్ రాసిచ్చిన జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ఎన్నికలు వచ్చాయంటే  చాలు.. రాజకీయ నాయకులు హామీల వర్షం కురిపిస్తుంటారు. ఆ హామీలు నిజంగా నెరవేరుస్తారనే ఆశతో ప్రజలు వారికి ఓట్లు వేసి గెలిపిస్తుంటారు. అయితే.. ఇచ్చిన హామీలను నెరవేర్చే వారు చాలా తక్కువ మంది ఉంటారన్నది వాస్తవం. 

మరి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదు... ఈసారి ఎలా ఓటు వేయాలి అడిగే ఓటర్లు ఉండకపోరు. అలాంటి వారి కోసం టీఆర్ఎస్ పార్టీకి చెంది తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సమాధానం చెబుతున్నారు.

తమ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన అగ్రిమెంట్ రాసిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనను జనగామ ఎమ్మెల్యే గా గెలిపిస్తే.. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని.. అది కూడా మూడు నెలల్లో పూర్తి చేస్తానని  హామీ ఇచ్చారు. ఈ మేరకు అగ్రిమెంట్ రాసి నియోజకవర్గ ప్రజలకు పంపిణీ చేశారు. కాగా.. ఆ అగ్రిమెంట్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?