కరోనా వివాదంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

Published : Mar 20, 2020, 01:08 PM IST
కరోనా వివాదంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

సారాంశం

ఈ నెల 16న కోనప్ప దంపతులు అమెరికా నుంచి వచ్చారు.అయితే క్వారంటైన్‌లో ఉండకుండా మరుసటి రోజే మున్సిపల్‌ సమావేశంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.

ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరో వివాదంలో ఇరుక్కున్నారు. గతేడాది ఫారెస్ట్ ఆఫీసర్‌పై దాడికి పాల్పడిన ఘటనలో వార్తల్లో నిలిచిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.. మరో వివాదంలో చిక్కుకున్నారు. కరోనా విషయంలో కోనప్ప తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16న కోనప్ప దంపతులు అమెరికా నుంచి వచ్చారు.

Also Read తెలంగాణలో 16కు పెరిగిన కరోనా కేసులు: సెర్చ్ ఆపరేషన్...
అయితే క్వారంటైన్‌లో ఉండకుండా మరుసటి రోజే మున్సిపల్‌ సమావేశంలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. బంధువులు, సన్నిహితుల ఇళ్లలో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతం, వివాహాలకు హాజరయ్యారు. అయితే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కోనప్ప దంపతులకు అన్ని పరీక్షలు చేశారు. ఆరోగ్యంగా ఉన్నందున క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదనేది కోనప్ప వాదనగా తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా..ఇప్పటికే తెలంగాణలో  16 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్థారించారు. వారందరికీ ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే