బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రియాక్ట్ అయ్యారు. అందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతాను... కేవలం నలుగురు మాత్రమే మిగిలిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేండ్లలో కేటీఆర్ బినామీ వేల కోట్లు దోచుకున్నాడని, త్వరలోనే ఆ వివరాలను ఆధారాలతో సహా వెల్లడిస్తానంటూ బాంబు పేల్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్లు దోచుకున్నారని దానం విరుచుకుపడ్డారు. ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరనేది, ఎంతెంత దోచుకున్నారు అనేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పైసలియ్యలే
undefined
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకర్గాలను అభివృద్ధి చేసుకుందామంటే నిధులే విడుదల చేయలేదని కేసీఆర్ పై మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏర్పాటు చేశారని దానం చెప్పారు.
ఇక బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురే
త్వరలోనే బీఆర్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందిని దానం నాగేందర్ మరో బాంబు పేల్చారు. ఆ పార్టీలో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని అన్నారు. బీఆర్ఎస్ ను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపారని, ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరికేది కాదన్నారు. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికినా గంటల కొద్ది వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు ఫ్రీడం ఉందని, అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పై నమ్మకం లేకనే ఆ పార్టీ నాయకులంతా కాంగ్రెస్ లోకి చేరుతున్నారని అన్నారు.
మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ పార్టలో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశారని, విలువ లేని దగ్గర ఎవరూ ఉండలేరని దానం నాగేందర్ అన్నారు. అందుకే అందుకే అందరూ కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. త్వరలోనే హస్తంగూటికి మరో ఆరుగురు ఎమ్మెల్యేలు చేరతారని అన్నారు. వీరితో పాటు త్వరలోనే మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మరోవైపు ఆరుగురు ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గె మల్లేశం, బస్వరాజ్ సారయ్య హస్తం పార్టీకి జై కొట్టారు.
ఎమ్మెల్యేలను స్వయంగా కేసీఆరే పంపుతున్నారు.. బండి సంజయ్
స్వయంగా కేసీఆరే సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేండ్లలో తాను చేసిన అవినీతి నుంచి బయట పడేందుకు కాంగ్రెస్‌కు కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు.