తెలంగాణ కొత్త డిజిపిగా జితేందర్ ... వెంటనే భారీగా ఐపిఎస్ ల బదిలీలు..

By Arun Kumar P  |  First Published Jul 10, 2024, 10:39 PM IST

తెలంగాాణ డిజిపిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జితేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన టీమ్ ను రెడీ చేసుకుంటూ భరీగా ఐపిఎస్ ల బదిలీ చేపట్టారు. 


హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ బాస్ గా  సీనియర్ ఐపిఎస్ ఆపీసర్ జితేందర్ నియమితులయ్యారు. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తొలి డిజిపి ఈయనే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిజిపిగా వ్యవహరించిన అంజనీ కుమార్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఈసి  రవిగుప్తాను డిజిపిగా నియమించింది. ఇంతకాలం ఆయననే కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జితేందర్ ను డిజిపిగా నియమించింది. 

ఇక జితేందర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే 15 మంది ఐఎఎస్ ల బదిలీలు జరిగాయి. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు నియమితులవగా ప్రస్తుత కమీషనర్ తరుణ్ జోషి ఏసీబీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. 

Latest Videos

undefined

బదిలీ తర్వాత ఐఎఎస్ ల పోస్టింగ్ లు : 

 లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్ 

హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా 

TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్  

గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర 

 మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి

రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజిగా రమేష్ నాయుడు

మల్టీ మల్టీజోన్ 2 ఐజిగా సత్యనారాయణ

హైదరాబాద్ సిఆర్ హెడ్ క్వాటర్ డిసిపిగా రక్షితమూర్తి 

మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి

వనపర్తి ఎస్పీగా గిరిధర్  

ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి

సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్ 

ఇక ఇంతకాలం డిజిపిగా వున్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నిమమించింది రేవంత్ ప్రభుత్వం. 


 

click me!