సోషల్ మీడియాలో పుకార్లు : అమాయకుడు మృతి

First Published May 23, 2018, 11:05 AM IST
Highlights

పుకార్లు వలన అమాయికుడు మృతి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లు  జనాల్లో నెలకొన్న అనుమానాలు, భయాలు  అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. భీమ్ గల్ మండలం చెంగల్‌లో ఇలాంటి అనుమానాలతోనే ఇద్దరు గిరిజనులను జనాలు తీవ్రంగా చితకబదారు. దాడిలో గాయపడ్డ ఒకరు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. 

చెంగల్ సమీపానికి ఉన్న తాండాలకు చెందిన దేవాగత్‌ లాలూ, అతని బావమరిది మాలావత్‌ దేవ్యా అనే గిరిజనులు మామిడి కాయల కోసం ఓ తోటలోకి వచ్చారు.

సరిగ్గా అదే సమయానికి నీళ్లకోసం అటుగా వెళ్లిన పశువుల కాపరి వాళ్లను చూసి భయపడి తన తండ్రికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు ఇద్దరినీ కర్రలతో తీవ్రంగా చితకబాదారు. 

పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు దేగావత్‌ లాలూను ఆర్మూరు మహాత్మాగాంధీ ఆస్పత్రికి, మాల్యావత్‌ దేవ్యాను హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు.

గ్రామస్తుల చేతిలో తీవ్రంగా గాయపడిన దేవ్యా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ప్రజలు భయంతోనే వారిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 12 మంది చెంగల్‌ గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. 

సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని, వాస్తవాలను గుర్తించాలని కోరారు. ఏదైనా అనుమానంగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

 

 

click me!