మారేడుపల్లి ఎస్‌ఐ కత్తితో దాడి చేసి పరారైన దుండగులు.. రాత్రి తనిఖీలు చేస్తుండగా..

Published : Aug 03, 2022, 09:32 AM IST
మారేడుపల్లి ఎస్‌ఐ కత్తితో దాడి చేసి పరారైన దుండగులు.. రాత్రి తనిఖీలు చేస్తుండగా..

సారాంశం

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మారేడుపల్లి ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. కత్తితో వినయ్‌ కుమార్‌పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. 

హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మారేడుపల్లి ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. కత్తితో వినయ్‌ కుమార్‌పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. వివరాలు.. వినయ్ కుమార్ మంగళవారం నైట్ డ్యూటీలో ఉన్నారు. రాత్రి 2 గంటల సమయంలో  తన సిబ్బందితో కలిసి మారేడుపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఓంశాంతి టిఫిన్ సెంటర్ ఎదురుగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బైక్‌ వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించారు. అయితే వారిలో ఒక వ్యక్తి సడన్‌గా కత్తి తీసి ఎస్‌ఐ వినయ్ కుమార్‌పై దాడి చేశాడు. కడుపులో కత్తితో పొడిచాడు. 

అనంతరం ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక, తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ వినయ్ కుమార్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఎస్‌ఐ వినయ్ కుమార్ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్