Amnesia Pub Rape Case : ఇన్ స్టాలో జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ వీడియోలు.. పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు...

By Bukka Sumabala  |  First Published Aug 3, 2022, 9:18 AM IST

సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ రేప్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 


హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు సహా ఐదుగురు యువకులు ఇన్నోవాలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన రెండు నెలల తర్వాత కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులు బాధిత బాలిక ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో ఇంకా ఉన్నాయని చెబుతూ.. వాటికి సంబంధించిన లింక్‌ల వివరాలను మహిళా భద్రతా విభాగం అధికారులకు అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ లింక్ లను తొలగించడానికి నగర పోలీసులు ఇప్పుడు Instagramకి లేఖ రాయాలని యోచిస్తున్నారు. ఎవరు అప్‌లోడ్ చేశారో ఆరాతీసి.. వారిమీద క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ప్రారంభించాలని కూడా భావిస్తున్నారు.

Latest Videos

undefined

జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కు వెళ్లిన బాలిక మీద కిడ్నాప్, సామూహిక అత్యాచారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలిక ప్రాణాలతో బయటపడింది. అయితే, ఆ తరువాత మైనర్ నిందితుడితో బాలిక ఉన్న ఫొటోలు, రెండు వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నట్లు బాలిక తల్లిదండ్రులు గమనించారు. ఒక ఫోటోలో బాలిక మెడపై గాయం గుర్తులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కనిపించాయి. రెండవ ఫోటో, రెండు వీడియోలలో మైనర్లు మైనర్ బాలికను అశ్లీలంగా మాట్లాడుతూ.. ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వీడియోలో, బాలిక, ముగ్గురు మైనర్ నిందితుల ముఖాలు కనిపించాయి.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు : మైనర్లను మేజర్లుగానే పరిగణించాలి..జువైనల్ బోర్డుకు విజ్ఞప్తి

వీడియోలు మరియు ఫోటోలు పేరు గోప్యత ఉన్న హ్యాండిల్ నుండి  జూన్ 3- 4 మధ్య అప్‌లోడ్ చేయబడ్డాయి. వీడియోలలో ఒకదానిలో, అప్‌లోడర్ అక్కడక్కడా చీకీ వాయిసోవర్ కూడా ఇచ్చాడు. మరికొందరు అమ్మాయిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు. బాధితురాలి ముఖం కనిపించే వీడియోను 2,000 మందికి పైగా లైక్ చేశారు. వీడియోలు, ఫోటోలను తీసివేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాయాలని నగర పోలీసులను కోరినట్లు మహిళా భద్రతా విభాగం అధికారులు ధృవీకరించారు.

మైనర్ గ్యాంగ్ రేప్ బాధితురాలి వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ నుండి తొలగించడానికి సైబర్ క్రైమ్ పోలీసుల సహాయాన్ని కోరుతాం. సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలను కూడా తీసుకుంటాం’’ అని విచారణలో భాగమైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు తెలిపారు. ఇంతకుముందు ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారులపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశారు.

"ఎక్కువగా IPC,  JJ చట్టం కింద సూమోటుగా కేసులు నమోదు చేసాం. ఈ కేసులకు సంబంధించిన అన్ని లింకులు తొలగించబడ్డాయి. ఒక కేసులో నిందితుడిని గుర్తించి అతనికి నోటీసు జారీ చేశాం. ఇతర నిందితులను ఇంకా గుర్తించలేదు.. అని, సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)

click me!