బాలికపై.. ఒకరికి తెలియకుండా మరొకరు అన్నదమ్ముల అత్యాచారం.. బ్లాక్ మెయిల్ చేస్తూ..

Published : Jan 06, 2023, 06:49 AM IST
బాలికపై.. ఒకరికి తెలియకుండా మరొకరు అన్నదమ్ముల అత్యాచారం.. బ్లాక్ మెయిల్ చేస్తూ..

సారాంశం

ఓ బాలికపై ఇద్దరు అన్నాదమ్ములు ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే అత్యాచారం చేశారు. 

వరంగల్ : వరంగల్లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి తెలియకుండా మరొకరు పలుమార్లు అత్యాచారం చేశారు. వారిద్దరూ ఓ కాలనీలో.. బాధితురాలి ఇంటి సమీపంలోనే ఉంటారు. అత్యాచారం చేసి ఆ బాధిత బాలిక న్యూడ్ వీడియోలు,  నగ్న చిత్రాలు తీశారు. వాటిని చూపించి, బెదిరించారు. పలుమార్లు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డారు. మిల్స్ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు  చూసింది. మిల్క్ కాలనీ సిఐ శ్రీనివాస్ ఈ ఘటనకు సంబంధించి ఈ మేరకు వివరాలు తెలిపారు.. 

ఓ బాలిక పదో తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఇంటి దగ్గరే ఉంటుంది. అదే కాలనీలో అంజద్ అలీ (26), అబ్బు (22) ఉంటున్నారు. వీరిద్దరూ అన్నదమ్ములు. ఆ బాలికతో  మాటలు కలిపారు. మెల్లిగా రోజు మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నారు. అన్నదమ్ములిద్దరూ విడివిడిగా ఆమెతో మాట్లాడేవారు. ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెతో పరిచయం పెంచుకున్నారు. అలాగే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను ఇంటికి పిలిపించేవారు. ఇది కూడా అన్నదమ్ములు ఇద్దరిలో ఒకరికి తెలియకుండా ఒకరు చేసేవారు. 

ఒక్క గుంట భూమి కూడా పోదు, రైతులకు ఇబ్బందైతే.. మాస్టర్ ప్లాన్ వెనక్కి : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్

అలా పలుమార్లు ఇంటికి వచ్చిన ఆమె మీద అత్యాచారం చేశారు. ఆ సమయంలో ఆమె వీడియోలు.. ఫోటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారు. దీంతో బాలిక భయపడిపోయి వారిద్దరూ చెప్పినట్టు వినేది. ఈ క్రమంలో ఓ రోజు అన్నదమ్ములిద్దరూ బాలికకు సైగలు చేస్తుండడం బాధిత బాలిక తల్లి గమనించింది. అనుమనం వచ్చి బాలికను ప్రశ్నించింది. మొదట ఏమీ చెప్పని ఆమె.. ఆ తర్వాత తల్లి గట్టిగా బెదిరించడంతో జరిగిన విషయాన్ని చెప్పి భోరుమంది. 

దీంతో వెంటనే తల్లి బాలికను తీర్చుకొని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. గురువారం అన్నదమ్ములు ఇద్దరు మీద ఫిర్యాదు చేసింది. అంజద్ అలీ, అబ్బులను పోలీసులు అరెస్ట్  చేశారు. వారి మీద  ఫోక్సో కేసుపెట్టారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, విషయం బయటకు రావడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు…నిందితుల ఇంటిపై దాడికి దిగారు.  వీరితో బీజేపీ నాయకులు కూడా కలిశారు. నిందితుల ఇంటిముందు పార్క్ చేసిన వెహికల్స్ ని ధ్వంసం చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu