పనికిలోకి రాలేదని మైనర్ బాలుడిపై యజమాని పైశాచికత్వం

Published : Aug 12, 2020, 06:03 PM IST
పనికిలోకి రాలేదని మైనర్ బాలుడిపై యజమాని పైశాచికత్వం

సారాంశం

పనిలోకి రాలేదనే నెపంతో 12 బాలుడిని యజమాని చిత్ర హింసలు పెట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది. జిల్లాలోని మల్కాపూర్ (ఎ)లో  ఈ ఘటన బుధవారం నాడు జరిగింది. 

నిజామాబాద్: పనిలోకి రాలేదనే నెపంతో 12 బాలుడిని యజమాని చిత్ర హింసలు పెట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది. జిల్లాలోని మల్కాపూర్ (ఎ)లో  ఈ ఘటన బుధవారం నాడు జరిగింది. 

12 ఏళ్ల బాలుడిని ఓ వ్యక్తి పనికి పెట్టుకొన్నాడు. మైనర్ బాలుడిని పనికి పెట్టుకోవడం నేరం. అయితే ఇవాళ పనికి రాలేదని యజమాని ఆ బాలుడి కాళ్లకు తాళ్లు కట్టి రోడ్డుపై లాక్కెళ్లాడు.

తనను వదిలిపెట్టాలని ఆ బాలుడు ఎంత బతిమిలాడినా కూడ అతను పట్టించుకోలేదు. కొద్ది దూరం మట్టిరోడ్డుపై చిన్న చిన్న రాళ్లపైనే లాక్కెళ్లాడు. కొద్దిసేపు  చెట్టుకు కట్టేశాడు. అంతేకాదు అతణ్ణి విపరీతంగా కొట్టాడు. 

ఈ తతంగాన్ని స్థానికులు అంతా సినిమా చూసినట్టు చూశారు, కానీ ఒక్కరూ కూడ ఆపలేదు. ఈ దృశ్యాలను కొందరు సెల్ ఫోన్లలో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిన్న పిల్లలను పనిలో పెట్టుకోకూడదని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను తుంగలో తొక్కి పనిలో పెట్టుకోవడమే కాకుండా తీవ్రంగా కొట్టడంపై పలు విమర్శలు చేలరేగుతున్నాయి. బాలుడిని కొట్టిన యజమానిపై చర్యలు తీసుకోోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

నల్గొండ భహిరంగ సభలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Inaugurates Development Works
Weather Update: హైదరాబాద్‌తో పాటు ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. 14 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్